మనవరాలితో కలిసి స్టెప్పులేసిన రఘువీరారెడ్డి.. వైరల్ వీడియో ఇదిగో!

  • క్రియాశీల రాజకీయాలకు దూరంగా రఘువీరారెడ్డి
  • మొత్తం సమయాన్ని కుటుంబానికే అంకితం చేసిన మాజీ మంత్రి
  • సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన రఘువీరా
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తన మనవరాలితో కలిసి స్టెప్పులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రఘువీరా రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గానూ పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 

తన సమయాన్ని మొత్తం కుటుంబానికే వెచ్చిస్తున్నారు. మనవరాలితో కలిసి ఆడిపాడుతున్నారు. తాజాగా, టీవీలో వస్తున్న ఓ పాటకు ఆయన డ్యాన్స్ చేశారు. ఇది చూసిన వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వయసులోనూ ఇంత చలాకీగా ఉండడం ఆయనకే చెల్లిందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, క్రియాశీల రాజకీయాలకు రఘువీరా దూరమైన తర్వాత ఇటీవల సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పెట్టిన ఓ పోస్టు కూడా వైరల్ అయింది. ఓ బావిని చూపిస్తూ తాను చిన్నప్పుడు ఇదే బావిలో ఈత నేర్చుకున్నానని, ఇప్పుడు ఇదే బావిలో తన మనవరాలికి ఈత నేర్పిస్తున్నట్టు ఆ పోస్టులో పేర్కొన్నారు.

Raghuveera Reddy
Congress
Andhra Pradesh

More Telugu News